ముఖేష్​ కంటే ఎక్కువ సంపాదిస్తుంది ఎవరో తెలుసా?

ఈ ఏడాది భారత్​లో అత్యధిక ఆదాయపరుడుగా గౌతమ్​ అదానీ

రోజుకు రూ.449 కోట్లు ఆదాయంతో దూసుకుపోతున్న అదానీ ఛైర్మన్​

By udayam on November 21st / 12:55 pm IST

అదానీ గ్రూప్​ ఛైర్మన్​ గౌతమ్​ అదానీ భారత బిలియనీర్లలో ఈ ఏడాది అత్యధిక ఆదాయాన్ని సంపాదించిన వ్యక్తిగా నిలిచాడని బ్లూమ్​బర్గ్​ వెల్లడించింది.

ఆసియా సంపన్నుడు ముఖేష్​ అంబానీ ఈ ఏడాది 16.4 బిలియన్​ డాలర్లు సంపాదిస్తే, అదానీ 19.1 బిలియన్​ డాలర్లు అంటే 1.41 లక్షల కోట్లు ఈ ఏడాది సంపాదించాడని ఆ పత్రిక వెల్లడించింది.

ఈ లెక్కన ఆయన రోజుకు రూ.449 కోట్ల రూపాయల్ని వెనకేసుకుంటున్నట్లు లెక్క కట్టింది. అదానీ కంటే ముందు వరుసలో స్టీమ్​ బామర్​, లారీ పేజ్​, బిల్​గేట్స్​ మాత్రమే రోజుకు అత్యధికంగా సంపాదిస్తున్నారని బ్లూమ్​బర్గ్​ తెలిపింది.

మొత్తంగా ఈ ఏడాది అదానీ ఆస్తి 30.4 బిలియన్​ డాలర్లకు చేరినట్లు తెలిపింది. దీంతో ఆయన ప్రపంచ బిలియనీర్ల జాబితలో 40వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ముఖేష్​ అంబానీ మొత్తం ఆస్తి 75 బిలియన్లకు చేరి ప్రపంచ కుబేరుల స్థానంలో 10వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది.