గంభీర్​కు మళ్ళీ ఐసిస్​ హెచ్చరికలు

By udayam on November 26th / 5:21 am IST

కశ్మీర్​కు, రాజకీయాలకు దూరంగా ఉండకపోతే మీ కుటుంబాన్ని, నిన్ను హత్య చేస్తామంటూ ఐఎస్​ఐఎస్​ కశ్మీర్​ తీవ్రవాద సంస్థ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​కు మరోసారి హెచ్చరిక ఈమెయిల్​ పంపింది. దీంతో పాటు ఆయన ఇంటి ముందు తీసిన వీడియోను కూడా isiskashmir@gmail.com ద్వారా అతడికి మెయిల్​ చేసింది. మంగళవారం నాడే తొలిసారిగా క్రికెటర్​కు హెచ్చరికలు పంపిన ఐసిస్​ గంటలు తిరగక ముందే మరోసారి హెచ్చరించినట్లయింది. ‘నిన్నటి రోజున నిన్ను చంపడానికి చేసిన ప్రయత్నం విఫలమయింది. ఇదిగో సాక్ష్యం’ అంటూ ఈమెయిల్​కు అతడి ఇంటిని వీడియో తీసిన క్లిప్​ను జత చేసింది.

ట్యాగ్స్​