భారత మాజీ క్రికెటర్, బిజెపి ఎంపి గౌతమ్ గంభీర్ ఈరోజు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అతడు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం అతడు ఐపిఎల్‌లో కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఒమన్ వేదికగా జరుగుతున్న లెజెండ్స్ లీగ్‌కు దూరంగా ఉన్న అతడు ప్రస్తుతం ఢిల్లీలోని అతడి ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాడు.