లోకేష్ – విజయ్ సినిమాలో గౌతమ్ మీనన్

By udayam on December 28th / 6:23 am IST

విక్రమ్​ మూవీతో ప్రతీ ఇండస్ట్రీ పెద్ద హీరో తన వైపు చూసేలా చేసుకున్న డైరెక్టర్​ లోకేష్​ కనగరాజ్​.. నెక్స్ట్​ మూవీ విజయ్​ తో తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి ఇప్పుడు క్రేజీ అప్డేట్​ వచ్చేసింది. తాజా అధికారిక సమాచారం మేరకు ఈ సినిమాలో దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. లోకేష్ – విజయ్ సినిమాలో తాను నటిస్తున్నానని స్వయంగా గౌతమ్ మీడియాకు వెల్లడించాడు. భారీ బడ్జెట్టుతో భారీ అంచనాల నడుమ తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్​ దశలో ఉంది.

ట్యాగ్స్​