అమెరికా గే క్లబ్బులో కాల్పులు.. ఐదుగురు మృతి

By udayam on November 21st / 9:50 am IST

మరోసారి అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. కొలరాడోలోని గే నైట్‌క్లబ్‌లో తుపాకీ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 18 మందికి గాయాలయ్యాయి. శనివారం రాత్రి 11.57 గంటలకు జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి ఓ వ్యక్తిని అరెస్ట్​ చేశారు. కాల్పులకు కారణాలు మాత్రం తెలియరాలేదు. ట్రాన్స్‌ఫోబియా కారణంగా హత్యకు గురైన వారి జ్ఞాపకార్థం ఏటా నవంబర్ 20న ‘ట్రాన్స్‌జెండర్ డే ఆఫ్ రిమెంబరెన్స్ జరుపుతుంటారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి.

ట్యాగ్స్​