అత్యంత ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్‌ను భారత్‌కు చెందిన హిందీ నవల రచయిత గీతాంజలి శ్రీ గెలుచుకున్నారు. ఆమె రాసిన హిందీ నవల రేత్ సమాధి (తెలుగులో ఇసుక సమాధి)కి ఈ అవార్డు దక్కింది. హిందీతో పాటు భారతీయ భాషల్లో వచ్చిన ఒక రచనకు బుకర్ ప్రైజ్రావడం ఇదే తొలిసారి. దేశ విభజన సమయంలో భర్త మరణించిన ఒక 80 ఏళ్ళ మహిళ జీవితంలో జరిగిన ఘటనలపై రేత్ సమాధి నవల వివరిస్తుంది. ఈ నవల ఇంగ్లీష్ అనువాదం ‘టూంబ్ ఆఫ్ శాడ్’కు గానూ ఈ బుకర్ ప్రైజ్ దక్కింది.