ఫిఫా వరల్డ్​ కప్​ మరో సంచలనం.. జర్మనీని కంగు తినిపించిన జపాన్​

By udayam on November 24th / 8:09 am IST

ఎడారి దేశం ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో వరుస సంచలనాలు నమోదవుతున్నాయి.మొన్న అర్జెంటీనాను సౌదీ అరేబియా ఓడిస్తే.. నిన్న జపాన్​.. జర్మనీని మట్టికరిపించింది. తొలి రౌండ్​ లో జర్మనీ ఆధిపత్యం చూపించి 2 గోల్స్​ వేస్తే అందులో ఒకటి ఆఫ్​ సైడ్​ అంటూ అంపైర్​ రద్దు చేశాడు. దీంతో 1–0 తో తొలి భాగాన్ని ముగించిన జర్మనీని.. రెండో అర్ధభాగంలో జపాన్​ నిలువరించింది. వరుసపెట్టి జపాన్​ గోల్ పోస్ట్​ పై దాడులు చేసిన ఆ జట్టు.. వావ్​ అనిపించే రీతిలో రెండు గోల్స్​ వేసింది. దీంతో జర్మనీ అభిమానులు స్టేడియంలో కన్నీటిపర్యంతమయ్యారు.

ట్యాగ్స్​