ప్రైవేట్ భాగస్వామ్యంతో కరోనా టీకా

అజిమ్ ప్రేమ్ జి సూచన

By udayam on February 23rd / 5:30 am IST

బెంగళూరు: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జోరుగానే సాగుతోంది. ఇప్పటివరకూ కోటిమందికి పైనే టీకా వేశారు.

ఈదశలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, విప్రో అధినేత అజిమ్ ప్రేమ్‌జీ స్పందిస్తూ .. టికా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రైవేటు రంగం భాగస్వామ్యం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సూచించారు.

ప్రైవేట్ సెక్టర్‌ భాగస్వామ్యం ద్వారా కేవలం 60 రోజుల్లోనే 50 కోట్ల మందికి టీకా అందించవచ్చని ఆయన తెలిపారు. భారత్‌లో రికార్డు స్థాయిలో టీకా ఉత్పత్తి జరుగుతోందని, అయితే,  టీకా పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

బెంగళూరు ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటూ అజిమ్ ప్రమే‌జీ కూడా పాల్గొన్నారు.

ఒక్కో టీకా డోసు రూ. 300 చొప్పున ఆస్పత్రులు, ప్రైవేటు నర్సీంగ్ హోంలకు అందేలా సీరం ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకోవచ్చు.ఆ తరువాతా ఒక్కరికి టీకా వేసింనందుకు రూ. 100 చొప్పున చెల్లించచ్చు. అంటే..ఒక్కో డోసు కోసం రూ. 400 ఖర్చు చూస్తే.. పెద్ద సంఖ్యలో ప్రజలకు టీకాలు అందేలా చేయవచ్చు అని ప్రేమ్ జి  వ్యాఖ్యానించారు.

ప్రజారోగ్య వ్యవస్థలో సంస్కరణలు తేవాలని అవసరాన్ని గుర్తుచేసే మేలుకొలుపే ఈ కరోనా సంక్షోభమని కూడా ప్రేమ్‌జీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రైవేట రంగం సహాయం కూడా తీసుకోవాలని పలు కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి.

ట్యాగ్స్​