నాళా పనుల నేపధ్యంలో.. మూడు నెలల ట్రాఫిక్​ మళ్ళింపు

By udayam on November 23rd / 12:02 pm IST

బేగంపేట పరిధిలోని రసూల్‌పురా-రాంగోపాల్‌పేట మధ్య నాలా పునరుద్ధరణ పనుల నేపథ్యంలో బుధవారం నుంచి 2023, ఫిబ్రవరి 21 వరకూ అంటే మూడు నెలల పాటు ట్రాఫిక్​ ను మళ్ళిస్తున్నట్లు పోలీస్​ కమిషనర్​ సివి ఆనంద్​ వెల్లడించారు. రసూల్‌పురా నుంచి కిమ్స్ ఆసుపత్రి, మినిస్టర్ రోడ్, రాణిగంజ్, నల్లగుట్ట వైపు వెళ్లే వాహనాలు సీటీవో ఫ్లై ఓవర్ వరకు వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, బేగంపేట ఫ్లై ఓవర్ నుంచి కిమ్స్ ఆసుపత్రి, మినిస్టర్ రోడ్, రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్ఆర్ మార్గ్ వైపు వెళ్లేందుకు రసూల్‌పురా టి-జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకునేందుకు అనుమతించరు.

ట్యాగ్స్​