అమెరికా ఉఠా రాష్ట్రంలో భారీ అనకొండ రోడ్డు దాటుతున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. రోడ్డు దాటే క్రమంలో వచ్చిన పొడవైన డివైడర్‌ను సైతం ఈ భారీ సరీశృపం సునాయాసంగా క్రాస్ చేసింది. ఈ పాము రోడ్డు దాటుతున్న క్రమంలో ట్రాఫిక్‌ను ఆపేసి మరీ దానికి దారిచ్చారు వాహనదారులు. దాదాపు 2 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకూ 3 లక్షల మంది వరకూ చూశారు. అనంతరం రోడ్డు పక్కన ఉన్న గడ్డి పొదల్లోకి వెళ్ళడంతో తిరిగి ట్రాఫిక్ కంటిన్యూ అయింది.