భారీ డైనోసార్​ శిలాజాలు

By udayam on June 8th / 11:17 am IST

9 కోట్ల ఏళ్ళ క్రితం భూమిపై సంచరించిన ఓ భారీ డైనోసార్​ జాతికి చెందిన శిలాజాలు ఆస్ట్రేలియాలో తొలిసారిగా బయటపడ్డాయి. ఈ జాతిని ఆస్ట్రాలోటిటన్​ కూపెరెన్సిస్​ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఇప్పుడు బయటపడ్డ ఈ జాతి శిలిజాలు ఇప్పటి వరకూ బయటపడ్డ అన్ని డైనోసార్ల కంటే పెద్దవని వీరు తేల్చారు. 25–30 మీటర్ల (82–98 అడుగులు) పొడవు, 16–21 అడుగుల ఎత్తు ఉండే ఈ జాతి బాస్కెట్​బాల్​ కోర్ట్​ అంత ఎత్తుండేదని తేల్చారు. వీటి బరువు 67 టన్నులుగా ఉండేవట.

ట్యాగ్స్​