తప్పించుకు పారిపోతున్న ‘చందమామ’

By udayam on September 23rd / 10:20 am IST

భూమికి సహజ ఉపగ్రహమైన చందమామ రోడ్డుపై పారిపోతున్న వీడియో ఆన్​లైన్​లో వైరల్​ అవుతోంది!! అదేంటి చందమామ భూమిపైకి ఎప్పుడొచ్చిందీ అనుకుంటున్నారా.. అయితే మీకు చైనాలో జరిగే చందమామ బెలూన్ల పండగ గురించి తెలియాల్సిందే. ప్రతీ ఏడాది చైనాలోని హెనాన్​ ప్రావిన్స్​లో చందమామ పండుగను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చందమామ ఆకారంలోని బెలూన్లను వివిధ సైజుల్లో ఎగురేస్తారు. ఈ పండుగ కోసం తయారైన ఓ భారీ చందమామ ఆ వేదిక నుంచి తప్పించుకుని రోడ్లపై పరుగులు పెట్టింది. దీని వెనుకనే నిర్వాహకులు సైతం పరుగు పెడుతున్న వీడియో ఇప్పుడు వైరల్​ అవుతోంది.

ట్యాగ్స్​