ఆ మాటల వల్లే వార్తల్లో ఉంటున్నాడు

సెహ్వాగ్ పై మ్యాక్స్​వెల్​ ఫైర్​

By udayam on November 20th / 2:36 pm IST

ఈ ఏడాది ఐపిఎల్​లో రాణించని తనను ‘పదికోట్ల రూపాయల విలువైన చీర్​లీడర్​’ అంటూ సెహ్వాగ్​ విమర్శించడంపై ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​ తీవ్రంగా స్పందించాడు.

అలాంటి మాటలు మాట్లాడడం వల్లే అతడిని మీడియా ఇంకా పట్టించుకుంటోందని లేదంటే ఎప్పుడో అతడిని మరిచిపోయేవారని గ్లెన్​ ఘాటుగా స్పందించాడు.

ఐపిఎల్​లో 13 మ్యాచ్​లు ఆడిన మ్యాక్స్​వెల్​ కేవలం 103 రన్స్​ మాత్రమే చేయడంతో సెహ్వాగ్​ అతడిపై తన ట్విట్టర్​ అకౌంట్లో ఫైర్​ అయ్యాడు.

‘‘వీరూ నా మీద చేసిన కామెంట్లు నాకు ఏం బాధ కలిగించలేదు. అతడు ఏది కావాలంటే అది మాట్లాడే స్వాతంత్రం అతడికి ఉంది. అతడు మాట్లాడే మాటల వల్లే ఇంకా మీడియాలో ఉంటున్నాడు. లేదంటే వారు కూడా అతడిని మరిచిపోదురు. నా పరిస్థితిని నేను చూసుకోగలను. నాకు అతడి సలహాలు అవసరం లేదు” అని గ్లెన్​ స్పందించాడు.