రూ.330 లక్షల కోట్లకు ఓటిటి బిజినెస్​

By udayam on May 26th / 10:13 am IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓవర్​ ద టాప్​ (ఓటిటి) బిజినెస్​ 2027 నాటికి రూ.330 లక్షల కోట్లకు (456.45 బిలియన్​ డాలర్లు) చేరుకుంటుందని ఫియర్​ మార్కెట్​ సంస్థ పేర్కొంది. సెట్​ టాప్​ బాక్స్​, గేమింగ్​ కన్సోల్స్​, లాప్​టాప్స్​, డెస్క్​టాప్​, టాబ్లెట్​, స్మార్ట్​ టివి, స్మార్ట్​ ఫోన్స్​ అమ్మకాలతో కలిపి ఈ మార్కెట్​ భారీ స్థాయికి చేరుకుంటుందని ప్రకటించింది. 2019లో ఈ మార్కెట్​ విలువ 132.68 బిలియన్ డాలర్లుగా ఉండగా 8 ఏళ్ళలో 3 రెట్లు పెరగనున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్​
OTT