ప్రైవేట్​ ట్రైన్లను మేమూ నడుపుతాం

ఆశక్తి వ్యక్తం చేసిన 13 భారీ కంపెనీలు

By udayam on November 20th / 2:44 pm IST

దేశంలోని కొన్ని రూట్లలో ప్రైవేట్​ ట్రైన్లను నడిపించాలని చూస్తున్న కేంద్రానికి ప్రైవేట్​ నుంచి ఆశించిన స్థాయి సహకారం లభించినట్లే ఉంది.

మొత్తంగా దేశంలోని 13 టాప్​ ప్రైవేట్​ కంపెనీలు తమ ఆశక్తిని వ్యక్తపరుస్తూ కేంద్రానికి లేఖలు రాశాయి. వాటిలో జిఎంఆర్​, ఇండియన్​ రైల్వేస్​ కేటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ (ఐఆర్​సిటిసి), ఎల్​ అండ్ టి ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్​ ప్రాజెక్ట్స్​, భారత్​ హెవీ ఎలక్ట్రికల్స్​, వెల్​స్పన్​ ఎంటర్​ప్రైజెస్​లు ఉన్నాయి.

రెవెన్యూ షేర్​ కోట్​ కింద కేంద్రం ప్రైవేట్​ రైల్​ నిర్వహించడానికి ఆశక్తి ఉన్న వారిని ఎంపిక చేయనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 12 రూట్లలో ఈ ప్రైవేట్​ ట్రైన్లు పరుగులు తీయనున్నాయి.

పైన పేర్కొన్న కంపెనీలు కాకుండా పిఎన్​సి ఇన్​ఫ్రాటెక్, క్యూబ్​ హైవేస్​ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, మేఘా ఇంజనీరింగ్​ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, ఐఆర్​బి ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలపర్స్​, కన్సార్టియం ఆఫ్​ గేట్​వే రైల్​ ఫ్రైట్​ అండ్​ గేట్​వే డిస్ట్రిపార్క్స్​, మాలెంపాటి పవర్​ అండ్​ టెక్నో ఇన్​ఫ్రా డెవలపర్స్​ వంటి పలు కంపెనీలు తమ ఆశక్తిని కనబరిచాయి.

ఎంపిక చేయబడ్డ కంపెనీలు 12 రూట్లలో 151 కోత్త ట్రైన్లను నడపనున్నాయి