గోవా లోని తనకు చెందిన ‘కాసా సింగ్’ విల్లాను పర్యాటకులకు అద్దెకు ఇస్తానని ప్రకటించిన మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు చుక్కెదురైంది. ఈ ప్రకటన తమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని గోవా సర్కార్ అతడికి నోటీసులు జారీ చేసి రూ.1 లక్ష జరిమానా కూడా వేసేసింది. గోవాలో పేయింగ్ గెస్ట్ విధానంలో ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే గోవా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్-1982 ప్రకారం నమోదు చేయించుకోవాలి. అయితే యువరాజ్ ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే, ఇంటిని గెస్టుల కోసం అద్దెకు ఇస్తామని ప్రకటన ఇవ్వడంపై గోవా అధికార వర్గాలు ఇలా స్పందించాయి.