హైదరాబాద్​ పాస్టర్​కు కార్డినల్​ హోదా

By udayam on May 30th / 12:51 pm IST

పోప్​ ఫ్రాన్సిస్​ ప్రకటించిన కొత్త కార్డినల్స్​లో మన దేశం నుంచి ఇద్దరు పాస్టర్లకు చోటు దక్కింది. హైదరాబాద్​కు చెందిన ఆర్చిబిషప్​ పూలా ఆంథోనీకి, గోవాకు చెందిన ఆర్చిబిషప్​ ఫిలిపే నేరి ఫెర్రోలకు పోప్​ ఫ్రాన్సిస్​ ఈ అరుదైన గౌరవాన్ని అందించారు. వీరికి ఈ ఏడాది ఆగస్ట్​ 27న వాటికన్​లో జరగనున్న వేడుకలో కార్డినల్​ హోదా దక్కనుంది. వీరిద్దరితో కలిపి దేశంలో మొత్తం కార్డినల్స్​ సంఖ్య 6కు చేరనుంది. గోవా నుంచి ఎన్నికైన తొలి కార్డినేట్​గా ఫెర్రో రికార్డులకెక్కారు.

ట్యాగ్స్​