కేంద్రం : ఇకపై హాల్​మార్కింగ్​ తప్పనిసరి

By udayam on May 30th / 10:56 am IST

బంగారం నాణ్యతతో సంబంధం లేకుండా ప్రతీ ఆభరణంపైనా హాల్​మార్కింగ్​ గుర్తు ఉండాల్సిందేనని కేంద్రం తాజాగా మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇకపై ప్రతీ బంగారు వ్యాపారి ఈ మార్క్​ ఉన్న ఆభరణాలనే అమ్మాలని పేర్కొంది. ఇప్పటి వరకూ 14, 18, 20, 22, 23, 24 క్యారెట్ల బంగారానికే హాల్​ మార్క్​ గుర్తులను వ్యాపారస్తులు వేసే వారు. 21, 19 క్యారెట్ల ఆభరణాలకు హాల్​మార్క్​ ఉండేది కాదు. అయితే జూన్​ 1 నుంచి అన్ని రకాల బంగారు ఆభరణాల పైనా ఈ గుర్తు ఉండేలా కేంద్రం మార్పులు చేసింది.

ట్యాగ్స్​