చైనాలోని తూర్పు షాండాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న బంగారు గనుల్లో భారీ పేలుళ్ళు సంభవించాయి. ఈ ప్రమాదంలో 22 మంది కూలీలు గనుల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
వారిని రక్షించడానికి రక్షణ బృందాలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి. కార్మికుల వద్ద ఉన్న సిగ్నల్ పాయింట్ సైతం బ్రేక్ కావడంతో వారి జాడ కనిపెట్టడం కష్టంగా ఉందని అక్కడి అధికారులు తెలిపారు.
చైనాలోని నాలుగో అతిపెత్త బంగారు గని అయిన ఝావోజిన్ మైనింగ్‌లో జరిగిన ఈ ప్రమాదం అక్కడి మైనింగ్‌లు ఎంతటి ప్రమాదకరమైనవో ప్రపంచానికి మరోసారి చాటిచెప్పాయి.
గత ఏడాది డిసెంబర్లో దాదాపు 18 మంది మంది కూలీలు అక్కడి ఓ గనిలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అది జరిగి నెల రోజులు తిరగక ముందే మరో ప్రమాదం జరిగింది.