RRR: ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డ్

By udayam on January 11th / 4:36 am IST

ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డ్ లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ కింద ఈ అవార్డ్ దక్కింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న తొలి ఆసియా పాట ఇదేనని ఆర్ఆర్ఆర్ మూవీ ట్విట్టర్‌లో పేర్కొంది. ఈరోజు లాస్ ఏంజిల్స్‌లో 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక జరిగింది. ఈ వేడుకకు రాజమౌళి, కీరవాణి, జూ. ఎన్‌టీఆర్, రామ్ చరణ్, రమా రాజమౌళి తదితరులు హాజరయ్యారు. ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అవార్డ్ అందుకున్నారు.

ట్యాగ్స్​