యానాం ప్రజల సమస్యలకు పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేపట్టిన నిరాహారదీక్ష నాలుగో రోజుకి చేరింది. పట్టణంలో ఆరోగ్య సదుపాయాలు మెరుగుపరచాలని, ఇళ్ల స్థలాల సమస్య వంటివి పరిష్కరించాలని ఆయన కోరుతున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లినప్పటికీ ఆయన స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీక్ష నాలుగో రోజుకి చేరడంతో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. గ్లూకోజ్ లెవల్, బీపీ పడిపోయినట్టు వైద్యులు చెబుతున్నారు.