ఇస్రో: మంగళయాన్​ ప్రయాణం ముగిసింది

By udayam on October 4th / 7:39 am IST

2013లో భారత్​ ప్రయోగించిన మంగళ్​యాన్​ మిషన్​ తన ప్రయాణాన్ని ముగించింది. మార్స్​ ఆర్బిటర్​ క్రాఫ్ట్​కు భూమి మీద ఉన్న కమాండ్​ కంట్రోల్​తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ఇస్రో ప్రకటించింది. ఇందులో ఇంధనం ఖాళీ అవ్వగా.. బ్యాటరీ సైతం డెడ్​ అయిపోయిందని పేర్కొన్నారు. రూ.450 కోట్లతో నిర్మించిన ఈ మంగళయాన్​ను భారత్​ మార్స్​ మీదకు 2013 నవంబర్​ 5న ప్రయోగించగా.. 2014 సెప్టెంబర్​ 24 నాటికి అరుణ గ్రహ కక్షలోకి విజయవంతంగా దూసుకెళ్ళింది. కేవలం ఆరు నెలలే పనిచేస్తుందని భావించగా.. అది ఏకంగా 8 ఏళ్ళ పాటు సేవలందించింది.

ట్యాగ్స్​