మోదీతో పిచాయ్​ భేటీ

By udayam on December 20th / 9:55 am IST

ప్రధాని నరేంద్ర మోడితో దిగ్గజ టెక్‌ కంపెనీ గూగుల్‌, అల్పాబెట్‌ సిఇఒ సుందర్‌ పిచాయ్ సమావేశం అయ్యారు. ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా భారత్‌ వచ్చిన పిచారు సోమవారం న్యూఢిల్లీలో ప్రధానితో సమావేశ మయ్యారు. అన్ని వర్గాల వారికి ఇంటర్నెట్‌ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇస్తామని పిచారు పేర్కొన్నారు. ‘మా దృఢమైన భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి భారత్‌ అధ్యక్షత వహిస్తోన్న జి-20 సదస్సు నిర్వహణకు పూర్తి మద్దతు కోసం ఎదురుచూస్తున్నాం’ అని ప్రధానితో భేటీ అనంతరం పిచారు ట్వీట్‌ చేశారు.

ట్యాగ్స్​