సరికొత్త డిజైన్​తో గూగుల్​ పే

By udayam on November 20th / 10:59 am IST

గూగుల్​ తన పేమెంట్స్​ సర్వీస్​ అయిన గూగుల్​ పేకు సరికొత్త లోగో, డిజైన్​ను ఆవిష్కరించింది. ఈ కొత్త డిజైన్​ యాప్​ ప్రస్తుతానికి అమెరికాకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఇది ఇంచుమించుగా భారత్​లో ఉన్న యాప్​లోని అన్ని ఫీచర్లను కలిగి ఉంటుందని తెలిపింది.

దీంతో పాటు గూగుల్​ పేకు సంబంధించి సరికొత్త లోగోను సైతం విడుదల చేసింది. దీనిపై గూగుల్​ ఉపాధ్యక్షుడు, జనరల్​ మేనేజర్​ సీజర్​ సేన్​గుప్త మాట్లాడుతూ ‘‘అమెరికాలోని తమ వినియోగదారులకు ఇకపై సులభమైన, సురక్షితమైన లావాదేవీలు జరపడానికి మేం మరింత మెరుగ్గా సిద్దమయ్యామని” పేర్కొన్నారు.

New Google Pay interface

తమ గూగుల్​ పే ద్వారా ఇకపై రెస్టారెంట్లలో ఫుడ్​ కూడా ఆర్డర్​ చేసుకోవచ్చని, డిజిటల్​ బ్యాంక్​ అకౌంట్​తో పాటు ఫైనాన్షియల్​ ట్రాన్సాక్షన్ల కోసం మరింత మెరుగైన ఫీచర్లను ఇందులో జోడించినట్లు గూగుల్​ వెల్లడించింది.

ప్రస్తుతానికి అమెరికాకు మాత్రమే పరిమితమైన ఈ కొత్త డిజైన్​ త్వరలోనే మిగిలిన ఆండ్రాయిడ్​ యూజర్లకు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది.