గూగుల్ మ్యాప్స్: ఇకపై టోల్ రేట్స్ కూడా

By udayam on June 14th / 10:03 am IST

లాంగ్ జర్నీల్లో పక్కాగా అడ్రస్ చెప్పే గూగుల్ మ్యాప్స్ ఇకపై టోల్ గేట్ వద్ద ఎంత చేతి చమురు వదులుతుందీ చెప్పేయనుంది. ఇప్పటికే గూగుల్ పిక్సెల్ ఫోన్ యూజర్లకు అందుబాటులో వున్న ఈ ఫీచర్ నేటి నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూసర్లకు అందుబాటులోకి రానుంది. దీంతో పాటు టోల్ లేని రోడ్ మ్యాపులను సైతం చూపించనుంది. ముందుగా భారత్ తో పాటు, ఇండోనేసియా, జపాన్, అమెరికా దేశాల్లో ఈ ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ఆపై మిగతా ప్రపంచ దేశాలకు ఈ ఫీచర్ ని తీసుకొస్తుంది.

ట్యాగ్స్​