ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తోందన్న భయాలు ఓ వైపు, వార్షిక లాభాలు తగ్గిన పరిస్థితి మరోవైపు ఉండడంతో టెక్ దిగ్గజాలు ఉద్యోగుల తొలగింపును వేగవంతం చేస్తున్నాయి. ఈ బాటలోనే దిగ్గజ ఐటి కంపెనీ గూగుల్ సైతం నడుస్తోంది. సంస్థలో పనితీరు సరిగ్గా లేని 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించేయాలని నిర్ణయించింది. అలాంటి 10వేల మంది ఉద్యోగులను గుర్తించమని మేనేజర్లను గూగుల్ ఆదేశించినట్లు తెలిపింది. తొలగింపబడుతున్న ఉద్యోగులు ఆ కంపెనీ మొత్తం ఉద్యోగాల్లో 6 శాతానికి సమానం.