గోరంట్ల: 120 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు

By udayam on December 30th / 11:08 am IST

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించారని మండిపడ్డారు. తద్వారా స్థానిక సంస్థలను ముఖ్యమంత్రి మోసం చేశారని అన్నారు. ఇప్పటి వరకు జగన్ రూ. 3 లక్షల కోట్లను దోపిడీ చేశారని ఆరోపించారు. జగన్ పై 120 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. మూడున్నరేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదని, ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పించలేదని బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

ట్యాగ్స్​