టిడిపికి గోరంట్ల గుడ్​బై?

By udayam on August 19th / 8:19 am IST

టిడిపి సీనియర్​ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ పార్టీకి గుడ్​ బై చెప్పేయనున్నారని వార్తలు వస్తున్నాయి. పార్టీలో సీనియర్​ని అయిన తనకు కనీస గౌరవం దక్కడం లేదని, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్​ కానీ తన ఫోన్లను తీయడం లేదంటూ గోరంట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. రాజమండ్రి రూరల్​ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి 2, 3 రోజుల్లో రాజీనామా చేయనున్నారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. టిడిపి రాజీనామా చేసినా వైఎస్​ఆర్​సిపి లోకి మాత్రం వెళ్ళనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​