కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారమన్.. జగన్ సర్కార్ ఊసెత్తకుండానే ఎపి ప్రభుత్వానికి చురకలంటించారు. ఉచితాలు, రాయితీలు అంటూ ఉన్న డబ్బంతా ప్రకటనలకు ఖర్చు చేస్తున్న ఓ రాష్ట్రం ఇప్పుడు జీతాలు ఇవ్వలేని దుస్థితికి చేరుకుందన్న ఆమె.. రాయితీలు సందర్భోచితంగా ఉండాలే తప్ప గొప్పలకు పోకూడదని సూచించారు. బడ్జెట్ లో మీకు తగిన నిధులు లేకుండా ఉచితాలు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించిన ఆమె.. పారదర్శకత లేని నిర్ణయాలతో ఇలాంటి అనర్ధాలే వస్తాయని హెచ్చరించారు.