కార్లు సహా పాత వాహనాల అమ్మకాలు ఇకపై సులుభతరం కానున్నాయి. పాత వాహనాల క్రయవిక్రయాల్లో ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధలను తీసుకొచ్చింది. దీని ప్రకారం పాత వాహనదారులు కొనేవారు, అమ్మేవారు ఇకపై రిజిష్టర్డ్ డీలర్లను సంప్రదిస్తే చాలు. డీలర్ ప్రామాణికతను గుర్తించేందుకు నమోదిత వాహనాల డీలర్లకు ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తీసుకొచ్చింది. ఈ నిబంధనలు వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.