కేంద్ర: ఏపీలో మూడు ఎయిర్​ పోర్ట్​ లు ప్రైవేట్​ పరం

By udayam on December 20th / 11:18 am IST

ఏపీలోని మూడు విమానాశ్రయాలు ప్రైవేటు పరం కానున్నాయి. 2022 – 2025 మధ్య కాలంలో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ కింద దేశంలోని 25 విమానాశ్రయాలను లీజుకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. వీటిలో ఏపీకి చెందిన విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ఎయిర్ పోర్టులు ఉన్నాయి. ఈ విషయాన్ని రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలోని 8 విమానాశ్రయాలను పీపీపీ విధానంలో ఇప్పటికే లీజుకు ఇచ్చినట్టు వెల్లడించారు.

ట్యాగ్స్​