కేంద్రం: రెండేళ్లలో కోటి ఉద్యోగాలు

By udayam on December 1st / 7:50 am IST

డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఎలక్ట్రానిక్స్, స్టార్టప్‌లు, ఐటీ-ఐటీ ఆధారిత సర్వీసుల రంగాల్లో వచ్చే రెండేళ్ల కాలంలో కోటి ఉద్యోగాల కల్పించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్‌ తెలిపారు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ, ఐటీ-ఐటీఈఎస్, స్టార్టప్‌లు మూడు ముఖ్య స్తంభాలుగా అభివర్ణించిన ఆయన, ఈ రంగాలు ఇప్పటికే 88-90 లక్షల మందికి కొత్తగా ఉపాధి కల్పించి నట్టు చెప్పారు. వచ్చే రెండేళ్లలో ఇది సులభంగానే కోటి దాటుతుందన్నారు.

ట్యాగ్స్​