ఈపీఎఫ్ వడ్డీ 8.1 శాతానికి తగ్గింపు

By udayam on June 4th / 4:06 am IST

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం తగ్గించింది. 2021-22 సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.1 శాతంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గత నాలుగు దశాబ్దాలలో ఇదే అత్యల్పం. 5 కోట్ల మంది వినియోగదారులు వున్న ఈపీయఫ్ లో వడ్డీ రేటును 8.5 నుంచి 8.1 శాతానికి చేయాలని ఈ ఏడాది మార్చి ప్రారంభంలోనే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్ణయించింది. 1977-78 తర్వాత ఇదే అతి తక్కువ వడ్డీ రేటు అని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. 1977-78లో వడ్డీ రేటు 8 శాతంగా ఉండేదని తెలిపింది.

ట్యాగ్స్​