క్రూడ్ సోయాబీన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ ఉత్పత్తులతో పాటు క్రూడ్ పామాయిల్‌పైనా డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ట్యాక్స్‌ను తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు పామాయిల్‌పై 10 శాతం ఇంపోర్ట్ ట్యాక్స్ కూడా మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో వంట నూనెల ధరలు రాబోయే రోజుల్లో తగ్గడం ఖాయమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన దేశం ప్రతీ ఏటా 55 నుంచి 60 శాతం మేర వంట నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.