దేశవ్యాప్తంగా బంగారం రేట్లు మరోసారి భారీగా పెరగనున్నాయి. పసిడి దిగుమతులపై ప్రభుత్వం జులై 1 నుంచి 10.75 శాతం ఉన్న ఇంపోర్ట్ ట్యాక్స్‌ను 15 శాతానికి పెంచడమే దీనికి కారణం. బంగారం దిగుమతులు అనూహ్యంగా పెరుగుతున్న తరుణంలో కరెంట్ ఖాతా లోటును తగ్గించుకునేందుకు కేంద్రం భారీగా పన్నుల్ని పెంచుతోంది. గతంలో బంగారంపై ప్రాథమిక దిగుమతి పన్ను 7.5 శాతంగా ఉండగా.. అది ఇప్పుడు 12.5 శాతానికి పెరిగింది. వీటిపై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ 2.5 శాతం అధికం.