పిఎం హౌసింగ్​ స్కీమ్​కు గడువు పెంచనున్న కేంద్రం

By udayam on May 9th / 6:43 am IST

ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన పథకం కింద పట్టణాల్లో నిర్మిస్తున్న ఇళ్ళను పూర్తి చేయడానికి కేంద్రం మరోసారి గడువును పెంచనుంది. ఈ గడువు ఈ ఏడాది మార్చితోనే ముగియగా.. దాన్ని 2024 మార్చి వరకూ పొడిగించడానికి సిద్ధమైంది. పట్టణాల్లోని పేదలకు పక్కా ఇళ్ళ నిర్మాణం కోసం ప్రధాని మోదీ ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దాదాపు 1.23 కోట్ల ఇళ్ళను నిర్మిస్తున్న కేంద్రం వీటిలో 98.4 లక్షల ఇళ్ళ నిర్మాణాన్ని మొదలుపెట్టింది. 58.7 లక్షల ఇళ్ళను ఇప్పటికే లబ్దిదారులకు అందించింది.

ట్యాగ్స్​