ఆ విద్యుత్​ కేంద్రాలన్నీ 100 శాతం పనిచేయాలి

By udayam on May 6th / 11:07 am IST

దిగుమతి చేసుకున్న బొగ్గుతో నడిచే దేశంలోని అన్ని విద్యుత్​ కేంద్రాలను 100 శాతం కెపాసిటితో పనిచేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ చట్టంలోని సెక్షన్​ 11 ప్రకారం పెరుగుతున్న విద్యుత్​ డిమాండ్​ను తీర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్న కేంద్రం.. ఈ వేసవి కాలానికి అవసరమైన 220 గిగావాట్ల విద్యుత్​ ఉత్పత్తే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే బొగ్గు మరింత వేగంగా తరలించేందుకు దేశవ్యాప్తంగా 1100 ప్యాసింజర్​ ట్రైన్లను సైతం రద్దు చేసింది.

 

ట్యాగ్స్​