మస్క్​ వ్యాపారానికి భారత్​ బ్రేకులు

By udayam on November 27th / 2:30 pm IST

వేలాదిగా శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి వాటి ద్వారా ఇంటర్నెట్​ను అందించాలన్న ఎలన్​ మస్క్​ ఆశలపై భారత్​ నీళ్ళు చల్లింది. స్టార్​లింక్​ ఇంటర్నెట్​ సర్వీసులకు భారత్​లో ప్రీ ఆర్డర్స్​ తీసుకోవడం మొదలుపెట్టిన మస్క్​కు భారత్​ నో చెప్పింది. ఇకపై ఆ కంపెనీకి ప్రీ ఆర్డర్​ చేయడం మానుకోవాలని భారతీయులకు హెచ్చరికలు పంపింది. ఇంకా ఆ కంపెనీలో భారత్​లో వ్యాపారం చేయడానికి ఎలాంటి లైసెన్స్​ తీసుకోలేదన్న ప్రభుత్వం.. లైసెన్స్​ తీసుకునే వరకూ స్టార్​లింక్​కు సబ్​స్క్రైబ్​ కావొద్దని ప్రజలకు సూచించింది.

ట్యాగ్స్​