రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 61 శిశు అభివృద్ధి కార్యక్రమ అధికారి (సిడిపిఒ) పోస్టులను ఎపిపిఎస్‌సి ద్వారా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల్లో ఖాళీగా ఉన్న సిడిపిఓ పోస్టుల వివరాలను అధికారులు సిఎంకు అందించారు.వీటితోపాటు ఖాళీగా ఉన్న పోస్టుల్లో సిబ్బందిని నియమంచాలని సిఎం సూచించారు.