రేషన్ కార్డు దారులకు తీపి కబురు అందించింది కేంద్రం, వచ్చే ఏడాది కూడా రేషన్ కార్డు దారులందరికీ ఫ్రీగా రేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 81కోట్ల మందికి రేషన్ అందించాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. ఫ్రీ రేషన్‌తో కేంద్రంపై రెండు లక్షల కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు సెంట్రల్ మినిస్టర్ పీయూష్ గోయల్. ఈ ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని ప్రకటించారు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఉచిత రేషన్ అందించనున్నట్లు చెప్పారు.