భారత్​తో జాగ్రత్త మరి

ఇంగ్లాండ్​ జట్టుకు మాజీ స్పిన్నర్​ గ్రేమ్​ స్వాన్​ వార్నింగ్​

By udayam on January 22nd / 2:06 pm IST

ఓటమిని ఇష్టపడని భారత జట్టుతో పోరాటమంటే ఇంగ్లాండ్​ జట్టుకు అతిపెద్ద సవాల్​ వంటిదని ఆ జట్టు మాజీ స్పిన్నర్​ గ్రేమ్​ స్వాన్​ హెచ్చరించాడు.

ఆస్ట్రేలియాను యాషెస్​లో ఓడించడం అనేది పెద్ద విషయం కాదు. భారత్​తోనే ఇంగ్లాండ్​కు అసలైన సవాలు ఎదురవబోతోంది. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే అంటూ సొంత జట్టుకు గీతోపదేశం చేశాడు.

ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా మొదలయ్యే మొదటి టెస్ట్​కు ఇప్పటికే ఇంగ్లాండ్​ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆసీస్​ను ఓడించడం కంటే భారత్​ను వారి సొంత గడ్డపై ఓడించడం చిన్న విషయం కాదని, విరాట్​ కోహ్లీతో పాటు వారి టీమ్​ మొత్తం ఆకలిగా ఉన్న సింహాల్లా కనిపిస్తున్నారు అని సూచించాడు.

2012 నుంచి వారు సొంత గడ్డపై ఓటమిని రుచి చూడలేదని, ఈసారి ఇంగ్లాండ్​ జట్టు ఆ పని చేయాలని గ్రేమీ ఆశాభావం వ్యక్తం చేశాడు.