ఆంధ్రప్రదేశ్‌కు మరో జాతీయ రహదారిని కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడ–నాగ్‌పూర్‌ల మధ్య 457 కి.మీ.ల మేర ఈ 6 వరుసల జాతీయ రహదారి నిర్మాణం కానుంది. ఇందుకోసం రూ.14 వేల కోట్ల వ్యయం కానుంది. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను వేగవంతం చేసే లక్ష్యంతో ఈ హైవే నిర్మాణం జరుగుతోంది. ఐదు ప్యాకేజీల కింద నిర్మించనున్న దీనిని విజయవాడ–ఖమ్మ, ఖమ్మం–వరంగల్, వరంగల్–మంచిర్యాల లను గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలుగా నిర్మిస్తున్నారు.