జగన్​: జనవరి నుంచి కడప ఉక్కు ఫ్యాక్టరీ పనులు

By udayam on December 24th / 6:57 am IST

కడప జిల్లా జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులు జనవరి నుంచి ప్రారంభం కానున్నాయని ఎపి సిఎం జగన్​ తెలిపారు. జిందాల్‌ స్టీల్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూ.8,800 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. జిల్లాలో 3రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు కమలాపురంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కొప్పర్తి పారిశ్రామికవాడలోని ఆరు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఇఎంసి, మెగా ఇండ్రస్టియల్‌ హబ్‌లు పూర్తి స్థాయిలో సాకారమైతే మూడు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయన్నారు. రూ.150 కోట్లతో కొప్పర్తి పారిశ్రామికవాడకు బ్రహ్మసాగర్‌ నుంచి నీటి సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్​