ఆన్లైన్ గేమింగ్ ప్రియులకు కేంద్ర మంత్రుల బృందం గట్టి షాక్ ఇచ్చింది. ఇలాంటి గేమ్స్‌పై జిఎస్టీని 18 నుంచి 28 శాతానికి పెంచుతున్నట్లు పేర్కొంది. అయితే ఈ చర్యపై స్కిల్ గేమింగ్ పరిశ్రమ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న 18 శాతాన్ని కొనసాగించాలని.. 28 శాతానికి పెంచే ఏటా 2.2 బిలియన్ డాలర్లు ఈ పరిశ్రమపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని 24×7 సంస్థ సీఈవో త్రివిక్రమ్ తంపి సైతం పేర్కొన్నారు.