నవంబర్లో రూ.1.45 లక్షల కోట్ల జీఎస్టీ

By udayam on December 2nd / 6:02 am IST

జీఎస్టీ గతంలో మాధిరే రికార్డు వసూళ్లు చేస్తోంది. నవంబర్​ నెలకు సంబంధించి రూ.1.45 లక్షల కోట్ల జిఎస్టీ వసూలైంది. గతేడాది నవంబరులో వసూలైన జీఎస్టీ కంటే ఇది 11 శాతం అధికం.సీజీఎస్టీ కింద రూ.25,681 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.32,651 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.77,103 కోట్లు, సెస్ కింద రూ.10,433 కోట్లు వసూలయ్యాయని ఆర్ధిక శాఖ ట్వీట్ చేసింది. దీంతో వరుసగా 9వ నెల కూడా జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటడం విశేషం.

ట్యాగ్స్​
GST