జిగ్నేష్​ మేవానీకి 3 నెలల జైలు

By udayam on May 6th / 5:39 am IST

ఐదేళ్ళ క్రిందటి ఓ కేసులో గుజరాత్​కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్​ మేవాణీకి మూడు నెలల జైలు శిక్ష పడింది. 2017లో అనుమతి లేకుండా ఆజాదీ మార్చ్​ నిర్వహించారన్న కేసులో విచారణ ముగించిన మెజిస్టీరియల్​ కోర్ట్​ ఆయనతో పాటు మరో 11 మందిని దోషులుగా తేల్చి శిక్షల్ని ఖరారు చేసింది. జిగ్నేష్​కు 3 నెలల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది. శిక్ష ఖరారైన వారిలో 12 మందిలో ఒకరు ఇది వరకే మరణించగా ఒకరు పరారీలో ఉన్నారు.

ట్యాగ్స్​