ఆస్కార్​ రేసుకు ఛెల్లో షో.. ఆర్​ఆర్​ఆర్​కు నో ఛాన్స్​

By udayam on September 21st / 5:37 am IST

2023 ఏడాదికి గానూ అకాడమీ అవార్డ్​ కోసం భారత తరపున అధికారిక ఎంట్రీగా గుజరాతీ మూవీ ‘ఛెల్లో షో’ ఎంపికైంది. 95వ అకాడెమీ అవార్డులకు భారత్ నుంచి తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్ బరిలో నిలుస్తుందని ప్రచారం జరిగింది. రాజమౌళి తీసిన ఈ చిత్రంలో టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఛెల్లో షో అంటే చివరి సినిమా షో అని అర్థం. పాన్ నలిన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డిసెంబర్ 21వ తేదీన అకాడెమీ అవార్డు తుది జాబితాను, వచ్చే ఏడాది మార్చి 12న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

ట్యాగ్స్​