తెలంగాణ యువకుడికి దుబాయ్ లో రూ.30 కోట్ల లాటరీ

By udayam on December 24th / 6:34 am IST

రాత్రికి రాత్రే దుబాయ్​ లాటరీలతో కోటీశ్వరులయ్యే భారతీయుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. తాజాగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా తుంగూరు నుంచి వెళ్ళి దుబాయ్​ లో పని చేస్తున్న తెలుగు వ్యక్తి అజయ్​ కు అక్కడ ఏకంగా రూ.30 కోట్ల లాటరీ తగిలింది. దీంతో కలలో కూడా ఊహించని అదృష్టంతో అతడు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. అజయ్​ నాలుగేళ్ళ క్రితమే దుబాయ్​ వెళ్ళి జ్యువెలరీ షాపులో డ్రైవర్​ గా పనిచేస్తున్నాడు. కేవలం 30 దిర్హాములతో కొన్న రెండు ఎమిరేట్స్​ లక్కీ లాటరీ టికెట్లు అతడి దశను మార్చేశాయి.

ట్యాగ్స్​