బ్యాంక్​ మేనేజర్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

By udayam on June 2nd / 9:40 am IST

సాధారణ పౌరులే లక్ష్యంగా జమ్మూ కశ్మీర్​లో తీవ్రవాదుల దాడులు పెరిగిపోతున్నాయి. మొన్న టివి యాంకర్​ను, నిన్న హిందూ టీచర్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు ఈరోజు ఓ బ్యాంక్​ మేనేజర్​ను కాల్చి చంపారు. కుల్గామ్​ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఆరే మోహన్​ పొరా ఎల్లాఖీ దేహతి బ్యాంక్​లో మేనేజర్​గా పనిచేస్తున్న విజయ్​ కుమార్​ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి వెళ్తుండగా మరణించాడు. విజయ్​ కుమార్​ది రాజస్థాన్​లోని హనుమాన్​ నగర్​ అని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్​