నైజీరియా : దుండగుల కాల్పుల్లో 12 మంది మృతి

By udayam on December 5th / 6:51 am IST

ఇస్లామిక్​ స్టేట్​ కు పెట్టని కోటలా వెలుగొందుతున్న నైజారియాలో మరోసారి తుపాకీ గుళ్ళకు అమాయకులు బలయ్యారు. ఓ మసీదులో జరిగిన విచక్షణారహిత కాల్పుల్లో 12 మంది ప్రాణాలుకోల్పోయారు. ఆ దేశాధ్యక్షుడు ముహమ్మదు బుహారి సొంత రాష్ట్రమైన కట్సినాలో ఆదివారం ఓ మసీదులోకి చొరబడ్డ ఆగంతకులు మసీదు ఇమామ్​ తో సహా 12 మందిని కాల్చి చంపి కొంత మందిని కిడ్నాప్​ చేసి తీసుకుపోయారు. స్థానికుల సాయంతో కిడ్నాప్‌కు గురైన వారిలో కొందరిని రక్షించినట్టు పోలీసులు చెప్పారు.

ట్యాగ్స్​